![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -143 లో..... మహాని మాధవ హాస్టల్ లోకి తీసుకొని వెళ్తాడు. మీరు తనకి ఏం అవుతారని వార్డెన్ అడుగుతుంది. అన్న అనుకుంటే అన్నా.. పెంచుకుంటే తండ్రి అవుతానని మాధవ చెప్తుంటే గార్డియన్ అనుకోవచ్చు కదా అని దివ్య అంటుంది. అవును అలాగే అనుకోండి అని మాధవ అంటాడు. తర్వాత మాధవ సంతకం పెడతాడు. ఆ తర్వాత మహాలక్ష్మి ని జాగ్రత్తగా చూసుకోండి తనకి బయట ప్రపంచం తెలియదని అక్కడున్న వాళ్లకి చెప్తూ మాధవ ఎమోషనల్ అవుతాడు. తర్వాత మాధవ ఏడుస్తూ వెళ్ళిపోతాడు. పెద్ది అని మహా పిలవగా.. మాధవ ఆగుతాడు. ఏంటి పెద్ది మీ కంట్లో కన్నీళ్లు అని మహా అడుగుతుంది.
అత్తింటికి పంపిస్తున్న తండ్రిలా అనిపిస్తుంది.. చెల్లిని వదిలి వెళ్తున్న అన్నలాగా అనిపిస్తుందని మాధవ ఎమోషనల్ అవుతాడు. నేను రెండు సందర్బాలలో గుండె పగిలేలా ఏడ్చాను.. ఒకటి మా నాన్నని వదిలి వెళ్తున్నప్పుడుమ. రెండోది ఇప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్తున్నప్పుడు.. నన్ను క్షమించండి పెద్ది అని మహా ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు నారాయణ ఇంటికి వస్తాడు. నువ్వు ఇచ్చిన సలహా వల్లే ఇలా అయిందని మహా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయం నారాయణకి చక్రి చెప్తాడు. ఎంత పని చేసావ్ రా అని చక్రి పై నారాయణ కోప్పడతాడు. ఇద్దరు గొడవ పడుతుంటే కేశవ వచ్చి ఆపుతాడు. ఆ తర్వాత మాధవ ఇంటికి వస్తాడు. నేను ఏం తప్పు చెయ్యలేదు.. కనీసం తనని తాకను కూడా తాకలేదు.. నేను తాగి తన రూమ్ కి వెళ్లడమే నేను చేసిన తప్పు.. నేను ఎలాంటి వాడినో తెలియదా అని చక్రి ఎమోషనల్ అవుతాడు.
ఆ తర్వాత ఇంట్లో వాళ్లంతా మహా జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు. మహా కూడా గుర్తుచేసుకొని బాధపడుతుంది. మరుసటిరోజు మహా హాస్టల్ దగ్గరికి నారాయణ వస్తాడు. వాడి తప్పేము లేదు.. నువ్వు ఎప్పటికి మా ఇంటి దగ్గరే ఉండాలని.. నేనే వాడిని రెచ్చగొట్టానని నారాయణ అనగానే నారాయణని మహా తిడుతుంది. తరువాయి భాగంలో మహా ఆఫీస్ కి చక్రి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |